ఈ చిన్న వెధవ వుండినచోట వుండడు కదా..??అనుకున్నాడు క్లార్క్.
క్లార్క్ ది స్కాట్లాండ్.అతడికి తొమ్మండుగురు పిల్లలు.కుటుంబంతో సహా అమెరికా వెళ్ళాలని కలలుగన్నాడు.సరిపడా డబ్బులు పోగేసుకున్నాడు.తన కలల ఓడ రేపు బయలుదేరుతుందనగా....
క్లార్క్ భార్య ఏడుస్తూ వచ్చింది.చిన్న కొడుకును కుక్క కరిచిందని.కంగారుగా దంపతులిద్దరూ డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు.డాక్టర్ పిల్లాడిని పరీక్షించి రేబిస్ వచ్చివుంటుందేమో అన్నాడు.14రోజులపాటు ఇల్లు కదలకూడదనీ చెప్పాడు.దాంతో క్లార్క్ కి ప్రయాణాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు.కాని ఆ విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోయాడు.ఆఖరికి ఓడ కదులుతుండగా కోపం వచ్చి కొడుకునీ దేవుణ్ణి తిట్టుకున్నాడు.కొన్ని రోజులు గడిచాయి.
ఓ రోజు క్లార్క్ కు ఈ వార్త తెలిసింది..
తాము ప్రయాణించాల్సి ఉన్న ఓడ సముద్రంలో ఐస్బర్గ్ ని ఢీకొని మునిగిపోయిందని,వందలాదిమంది సజీవంగా సముద్రంలో సమాధి అయ్యారనీ,అంత గొప్ప ఓడ ఎలా మునిగిపోయిందా అని ప్రపంచ వ్యాప్తంగా మేధావులందరూ విస్తుపోయారు.
ఆ ఓడ పేరు టైటానిక్
క్లార్క్ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.వార్త విన్న వెంటనే ఇంటికి పరుగెత్తికొని వచ్చాడు.కొడుకును ముద్దులతో ముంచెత్తాడు.దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.తమ ప్రయాణాన్ని ఆపి బ్రతికేలా చేసినందుకు....
ఈ సంఘటన నుండి రెండు విషయాలు నేర్చుకోవచ్చు.
ఒకటి అందరూ చెప్పేదే..ఏది జరిగినా అది మంచికే..
రెండోది..ఇంకా అందమైన పాఠం..
ఏది జరిగినా,జరిగినదాన్ని ప్రేమించగలగాలి.
కుక్క కాటేసి జ్వరంతో బాధపడుతున్న కొడుకు వల్ల భవిష్యత్ మునిగిపోయిందని నిందించే పరిస్ధితి వచ్చినప్పుడు,
అసలు ఆ వచ్చే భవిష్యత్ ఎందుకు?
రేపటి కోసం నేటినీ,
నిన్న జరిగిన దానికి ఇవాల్టినీ నిందించడం తప్పు..
నువ్వు ఆ రోజు అలా చేయకుండా వుండాల్సింది...??
ఈరోజు ఇలా అనకుండా ఉండాల్సింది..??
అంటూ భార్య భర్తను,భర్త భార్యను,తల్లితండ్రులు పిల్లలను అంటూ వుంటారు.అలా చేయడం వల్ల నష్టం జరిగిందనో,నష్టం వచ్చినట్టుగా అనిపించడం వల్లనో వారిని విసుక్కుంటూ వుంటారు.
కానీ ఏది ఎలా జరిగినా వారిని ప్రేమించగలగాలి.లేదంటే ఎంత గొప్ప బంధాలైనా టైటానిక్ లా మునిగిపోతాయి...............!!!!
Tags
Best Good night quotes in telugu,
good moral stories in telugu,
Short moral stories in telugu,
inspirational moral stories in telugu,
single page moral stories in telugu,
Post a Comment