Sunday, 11 September 2022

Best Dussehra greetings wishes happy vijayadashami sms text messages for whatsapp free download pdf - విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలుగులో

Best Dussehra greetings wishes happy vijayadashami sms text messages for whatsapp free download pdf, విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలుగులో, 

శమీ వృక్ష ప్రస్థావన- history, information and full stotry 

మహాభారతంలో విరాటపర్వమునకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. పాండవ కౌరవ మధ్య జరిగిన పాచికలాట లో ఓడిపోయినందుకు.. 14 సంవత్సరములు అరణ్యవాసం.. ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేయాలి.. ఒకవేళ ఇది break అయితే.. అంటే అజ్ఞాత వాసంలో పాండవుల identity తెలిసిపోతే తిరిగి మళ్ళీ 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి ఉంటుంది అన్నమాట... పాండవుల ఆయుధాలు unique గా ఉంటాయి... అందుకే అవి ధరించిన వారు ఎవరైనా సరే ఇట్టే గుర్తు పట్టేయవచు.. ఒకవేళ భూమిలో పాతి పెడితే.. ఆ అయుధాల power పోతుంది అన్నమాట... అందువలన పాండవులు తప్పని సరిగా carry చేయాల్సి ఉంటుంది... బయట ఏ చెట్టు పై పెట్టినా అవి కనపడతాయి కాబట్టి.. ఇట్టే బయట పడి పోతారు అన్నమాట... అయితే పాండవులు ఆ ఆయుధాలను జమ్మిచెట్టు పై పెడతారు.. జమ్మి చెట్టు చాలా ఎత్తుగా ధృఢంగా ఉండి.. శ్మశానము లాంటి ప్రదేశాలలోనే ఉంటాయి.. ఆ వృక్షాలపై శవాలను కూడా ఉంచేవారట... అందుకే పాండవులు తమ ఆయుధాలను శవ రూపంలో చాలా ఎత్తుగా ఉంచేసారు... విరాట పర్వం ముగిసే రోజు వాటిని తిరిగి విజయదశమికి ఒక రోజు ముందు బయటకు తీసి.. విరాట రాజు కౌరవులపై జరిగిన యుద్దంలో విరాటరాజు తరపున పోరాటమ్ చేసి విజయం సాధిస్తారు.. అందుకే విజయదశమికి ఒకరోజు ముందు రోజును ఆయుధ పూజగా ఇప్పటికీ జరుపుకుంటారు... ఆరోజు ప్రజలు వారి వారి ఆయుధాలను పూజలో ఉంచుతారు.. శమీ వృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఆ వృక్షము ఆకులను బంగారంలా పంచుకుంటారు.. పెద్దవారికి ఆ ఆకులను ఇచ్చి అక్షింతలు లాగా వేయించుకుంటారు.... తమ తమ డబ్బు పెట్టెలలో భద్రంగా ఉంచుకుంటే... ధనం వృద్ధి అవుతుందని నమ్మకం.. మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు...


శమీ వృక్ష ప్రార్థనా శ్లోకం - Shamee vRukSha praarthanaa shlOkaM

శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని || ౧ ||

శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం
ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం || ౨ ||

నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే
త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ || ౩ ||

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ || ౪ ||

అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం
దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం || ౫ ||
shami vruksha leeves jammi chettu akulu images- శమీ వృక్ష ప్రార్థనా శ్లోకం

Post a Comment

Whatsapp Button works on Mobile Device only