Monday, 10 October 2022

మునగ ఆకులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఉపయోగించకుండా ఉండలేరు Munaga aku - Drum Sticks leaves benefits - how to utilize very easily - health tips in telugu - ammamma chitkalu

మునగ ఆకులను ఇలా కూడా ఉపయోగించవచ్చు అని చాలా మందికి తెలియదు
Moringa Benefits and how to use very easily:

పూర్వం మన భారత దేశంలో దాదాపు 700 రకాల దినుసులను ఆకుకూరలుగా, పచ్చడులుగా, పొడులుగా, పప్పు కూర, సాంబార్, లాంటి వేర్వేరు పేర్లతో ఆహారంలో భాగంగా ఉపయోగించేవారు... అయితే ఇప్పుడు కనీసం వాటిని గుర్తుపట్టే స్థాయిలో కూడా ఈ generation వారు ఉండడంలేదు.. అందుకే వారికి ఉపయోగపడే విధంగా ఈ రోజు నుండి కొన్ని ఆర్టికిల్స్ మీ ముందు ఉంచుతున్నాము... తప్పక follow కండి.. మీ మిత్రులకు షేర్ చేయండి...
ఈ రోజు అంశం లో మునగ ఆకు గురించి వివరిస్తున్నాము..
లేత మునగ ఆకు ను పప్పులో ఉపయోగించుకోవచ్చు.. ఇది దాదాపు మెంతికూర పప్పు మాదిరి రుచి వస్తుంది.. ముదురు ఆకులు కొంచెం చేదు తగులుతుంది.. కానీ లేత ఆకుల తో చేసిన పప్పు మెంతికూర పప్పుకు.. ఈ పప్పుకూరకు తేడా తెలియదు.. ఈ సారి తప్పక ప్రయత్నించండి...ఇక మునగను ఇప్పుడు దాదాపు అన్ని రకా వంటకాల్లో కూడా వినియోగించవచ్చు.... మునగ ఆకులు, కాడ, కాయల్లో, పువుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి మూలకాలతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వీటిని మోరింగా పౌడర్ అనే పేరుతో ఆఫ్రికా దేశ ప్రజలకు పోషకాహారంలా ఉపయోగిస్తున్నారు...

Moringa benefits in telugu - how to cook very easily

 Munaga - Moringa - Immunity Booster
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తరచుగా మునగ సప్లిమెంట్స్ ఏ రూపంలో తీసుకున్నా.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది...
 
Munaga - Moringa for improve Platelet Count - Dengue medicine  
ప్లేట్ లెట్ లెవల్స్ పెరగడంలో ఈ ఆకు చక్కగా ఉపయోగపడుతుంది..(ప్లేట్ లెట్స్ కోసం అన్నిటికన్నా మెరుగైనది బొప్పాయి ఆకుల రసం.. డైరెక్ట్ గా తాగలేని వారు తాగగలిగిన విధంగా తేనె కలుపుకుని తాగవచ్చు)

Munaga - Omega -3 fatty acids - Reduce Heart Deceases
మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. మునగ ఆకు కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది.

Munaga - Moringa for Diabetic Patients
డయాబెటిక్ రోగులకు.. డయాబెటీస్ సమస్యలు ఉన్నవారికి కూడా మునగ ఆకులు చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో ఎంతో ప్రభావం చూపుతాయి.


ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం.. అనేక రకాల వ్యాధులకు మూలం జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. మనుగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మునగ ఆకు పొడి చేసుకునే విధానం
మునగ ఆకులను ఎక్కువ సంఖ్యలో సేకరించి వాటిని ఎండబెట్టి.. పొడి చేసుకుంటే అవసరమైనప్పుడు డైరెక్ట్ గా అన్నంలో పొడిలా కలుపు కుని తినవచ్చు... ఏదైనా కూర.. సాంబార్.. లలో కొంచెం మోతాదులలో ఉపయోగిస్తు కూడా రుచి లో మార్పు లేకుండా ఉపయోగించవచ్చు.. ఇలా చేస్తే మనకు తెలియకుండానే ఈ మునగ ఆకు సప్లిమెంట్స్ మన శరీరంలోకి వెళతాయి... 


గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only